మహాభారతములో పాండవులకు అత్యంత ప్రాముఖ్యము కలదు.
పాండవులు అనగా పాండురాజు కుమారులు.వీరు ఐదుగురు అందుచేత వీరిని పంచపాండవులు అని అంటారు.
పాండురాజుకి ముని శాప కారణముగా ఏ స్త్రీ అయితే సంఘమిస్తే మరుక్షణమే మరణించును.
పాండురాజు భార్య కుంతీ దేవి తనకు ఉన్న వరము కారణంగా కోరుకున్న వారితో సంతానం సిద్దించును.
దీనితో పాండురాజు తన వంశం నిర్వంశం కాకూడదని కుంతీ దేవిని నీ వరము ఉపయోగించి పుత్రులు కావాలని కోరతాడు.
తన భర్త అజ్ఞానుసారం కుంతీ తన వర ప్రభావముచే ధర్మరాజు,భీముడు,అర్జునుడు లకు జన్మనిస్తుంది.
ఆ తర్వాత కుంతి పాండు రాజు రెండవ భార్య మాద్రి కి ఈ వరము ఉపదేశించడం వల్ల ఆమెకు నకుల సహదేవులు జన్మిస్తారు.
పంచపాండవులు
1.ధర్మరాజు - అజాత శత్రువైన ధర్మరాజు పాండవులలో పెద్దవాడు.ధర్మరాజు యముడు వరం కారణంగా జన్మిస్తాడు.
2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.
3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు
4.నకులుడు
5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.
|
No comments:
Post a Comment